ఆడవాళ్ల చేతివేళ్లు చూడటానికి చాలా మృదువుగా అందంగా ఉంటాయి. అలాంటి చేతివేళ్లు ఇంకా అందంగా కనిపించాలంటే వాటికి నెయిల్ పాలిష్ వేసుకోవడమో, రింగులు పెట్టుకోవడమో చేస్తాం. ఇంకా కొంచెం మోడ్రన్ గా కనిపించాలంటే... ఇప్పుడు కాక్ టెయిల్ రింగులు దొరుకుతున్నాయి. ఇవి స్టోన్స్ తో ఉండి చాలా అందంగా ఉంటాయి. వివిధ రంగుల్లో, ఆకారాల్లో దొరుకుతున్నాయి. ఇవి ఆకారంలో పెద్దగా ఉండి కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి.ఈ రింగులు ట్రెడిషనల్ వేర్ గా కంటే పార్టీ వేర్ కి చాలా బాగా నప్పుతాయి. స్టోన్స్ తో పెద్దగా ఉండటం వలన మధ్య వేలుకి ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. అందరిలో ప్రత్యేకంగా కనిపిస్తారు. ఇవి పూర్వం ఎప్పటినుంచో ఉన్నా ఇప్పుడు మళ్లీ కొత్తగా వివిధ హంగులతో మార్కెట్ లోకి వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.
For More At : http://teluguone.com/vanitha/content/cocktail-rings-collections-71-32641.html#.VSJ1qdyUfVE
No comments:
Post a Comment