సహజంగా ఫుడ్ ఐటమ్స్ అందంగా కనిపించడానికి మనం కార్వింగ్ చేస్తాం. మరి మనం అందంగా కనిపించాలంటే... సాధారణంగా ఆడవాళ్లు చెప్పులు, గాజులు, చెవిరింగులు వంటి వాటిపైన ఆసక్తి చూపిస్తారు. కానీ మెడలో వేసుకొనే వాటిపైన ఎక్కువ దృష్టి పెట్టరు. రోజూ ఒకే మోడల్ చైన్ వేసుకుంటే ఏం బావుంటుంది. అప్పడప్పుడు ఫ్యాషన్ కు తగట్టు మారుస్తూ ఉండాలి. అలా ఫ్యాషన్ గా ఉండే చైన్స్ లో కార్వింగ్ స్టోన్ డిజైన్ చైన్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇవి చాలా ఫ్యాషనబుల్ గా ఉంటాయి. రకరకాల ఆకారాలలో రంగు రాళ్లతో చెక్కే ఈ డిజైన్స్ జీన్స్, డ్రస్ ల పైకే కాదు చీరల పైన కూడా వేసుకోవచ్చు. మోడ్రన్ గా ఉండే కాలేజ్ స్టూడెంట్స్ కి అయితే బాగా నప్పుతాయి. నలుగురిలో ప్రత్యేకంగా కనపడతారు. అయితే మీరు కూడా అలా కనిపించాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి.
For MOre At : http://www.teluguone.com/vanitha/content/carving-stone-designs-71-32647.html#.VS4l0tyUfVF
No comments:
Post a Comment